మోపాల్: మండలంలోని నర్సింగ్‌పల్లిలో ఉన్న ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు రెండోరోజు శుక్రవారం కొనసాగాయి. గుడ ధ్వజారోహణ దేవత ఆహ్వానం తర్వాత సంతానార్థులకు గరుడ ప్రసాదం అందించారు. సాయంత్రం శేష వాహన సేవలో స్వామి వారి ప్రతిమలను ఉంచి ఊరేగించారు. మనసా వాచ కర్మన ఆ దేవదేవుడిని నమ్మితే కలికాలంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని ఆచార్య గంగోత్రి రామానుజ దాసు స్వామి ప్రవచించారు. ఉత్సవం అంటే లోకమంతా సంతోషించడమని, బ్రహ్మోత్సవం అంటే సాక్షాత్తూ బ్రహ్మనే లోక కల్యాణం కోసం జరిపించే ఉత్సవమని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, నర్సారెడ్డి, నరాల సుధాకర్, ప్రసాద్, రాజేశ్వర్, రమేశ్, సాయిలు, భాస్కర్, మురళి, చిన్నయ్య, గంగారెడ్డి, నరేశ్, సురేశ్, యజ్ఞాచార్యులు శ్రీఖర్ ఆచార్య, స్వామి రోహిత్ కుమారాచార్యులు, విజయ్ స్వామి, శిఖామణి స్వామి తదితరులు పాల్గొన్నారు.