నిజామాబాద్‌అర్బన్ / ఆర్మూర్ టౌన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు 22,774 మందికి విద్యార్థులకుగాను 22,715 మంది హాజరయ్యారు. 59 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభంకాగా గంట ముందు నుంచే విద్యార్థులను లోనికి అనుమతించారు. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రంలోకి పంపించారు. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీ క్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి, విద్యార్థులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. లోటుపాట్లకు తావులేకుండా స జావుగా పరీక్షలు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులను ఆదేశించారు. ఎక్క డా కాపీయింగ్‌కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పెర్కిట్‌లో ని జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, చీఫ్ సూపరింటెండెంట్ కవిత ఉన్నారు.
తొలిరోజు ప్రశాంతం
కేంద్రాన్ని తనిఖీ చేసిన
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
‘పది’ పరీక్షలు ప్రారంభం