ఆర్మూర్ : గోదావరి పరీవాహక ప్రాంతాలను పర్యాట క ప్రాంతాలుగా అభివృద్ధి చే యాలని సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పురాతన ఆలయాలున్న ఉమ్మెడ, కొండూరు, చిన్న యానాం వంటి ప్రాంతాలతో పాటు గోదావరి తీరాన భూములను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడంతో చాలా మందికి ఉపాధి లభిస్తుందన్నారు. జిల్లాకు బాసర పుణ్యక్షేత్రం అతి దగ్గర ఉండటంతో త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నా రు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథుల సిద్ధుల గుట్ట అభివృద్ధి కోసం గతంలో దేవాదాయ శాఖ మంత్రికి విన్నవించినా స్పందించలేదని ఆరోపించారు. కొడంగల్‌తో సమానంగా కాకున్నా కొంతైనా నిధు లు తమ నియోజకవర్గానికి ఇవ్వాలన్నారు. జక్రాన్‌పల్లి విమానాశ్రయ ఏ ర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే
పైడి రాకేశ్ రెడ్డి