బోధన్: షుగర్ ఫ్యాక్టరీల నిర్వహణ, అధిక దిగుబడులు అందించే చెరుకు సాగు పద్ధతుల అధ్యయనం కోసం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీతోపాటు అధికారుల బృందం మహారాష్ట్రలో రెండురోజులు పర్యటించింది. మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లా సాంగ్లీ నగర కేంద్రంలోని శ్రీదత్తా కో – ఆపరేటీవ్ షుగర్ ఫ్యాక్టరీని అధికారులు శనివారం, కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు సభ్యులు, రైతులు ఆదివారం సందర్శించారు. ఫ్యాక్టరీ చైర్మన్ గణపతిరావు పాటిల్‌తో సమావేశమై ఫ్యాక్టరీ నిర్వహణ విధానం, అధిక దిగుబడులు అందించే వంగడాలు, రికవరీ, రోజువారీ క్రషింగ్ తదితర అంశాలను తెలుసుకున్నారు. అనంతరం చెరుకు తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధిక దిగుబడులు సాధించేందుకు సాగులో పాటించాల్సిన పద్ధతులను రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రత్యేక కమిటీ సభ్యుడు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, పరిశ్రమల డైరెక్టర్ మన్సూద్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, రాష్ట్ర, జిల్లా స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యానవన, పరిశ్రమలు, షుగర్ కేన్ శాఖల అధికారులు, బోధన్ ప్రాంత రైతులు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో షుగర్ ఫ్యాక్టరీ
పునరుద్ధరణ కమిటీ స్టడీ టూర్
రెండురోజులపాటు సాగిన పర్యటన
మొదటి రోజు అధికారులు, రెండో రోజు సభ్యులు..
పాల్గొన్న మంత్రి, కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి