ఖలీల్‌వాడి: నిజామాబాద్ రై ల్వేస్టేషన్‌లో ఓ బాలిక అదృశ్యమైనట్లు ఎస్‌హెచ్‌వో ర ఘుపతి, రైల్వే ఎస్సై సాయిరె డ్డి శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. వివరాలు ఇలా.. బాన్సువాడకు చెందిన మహేంధర్ సింగ్ తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి ఈ నెల 13న నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. నాందేడ్ వెళ్లడానికి దేవగిరి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. కొంతసేపటికి తన కూతురు సోనమ్‌కౌర్(4) కనిపించలేదని, రైలులో వెతికినా ఆచూకీ లభించలేదని మహేందర్‌సింగ్ తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికై నా బాలిక ఆచూకీ తెలిస్తే నిజామాబాద్ రైల్వే పోలీసులకు గాని, ఒకటో టౌన్ పోలీసులకు గాని సమాచారం అందించాలన్నారు.
పశువులను తరలిస్తున్న వాహనాల పట్టివేత
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మీదుగా అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాలను బజరంగ్‌దళ్ నాయకులు శనివారం అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా సాటాపూర్ నుంచి రెండు లారీలలో పరిమితికి మించి అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నారన్న సమాచారం బజరంగ్‌దళ్ సభ్యులకు తెలిసింది.దీంతో వారు ఆజామాబాద్ గేట్ వద్ద రెండు లారీలను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు రెండు లారీలలో ఉ న్న పశువులను బిచ్కుంద గోశాలకు తరలించారు.
8 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని పీడీఎస్ రైస్ గోదాంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించి 8 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి ఏసీపీ నాగేంద్ర ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య, సిబ్బంది పట్టణంలోని 3 గోదాముల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వచేసిన 8 టన్నుల రేషన్ బియ్యంను పట్టుకున్నారు. వీటి విలువ రూ. 2,80,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. మూడు గోదాముల యజమానులును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.
నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో బాలిక అదృశ్యం
నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో బాలిక అదృశ్యం