
ఆత్మవిశ్వాసంతో సాగితే అద్భుతాలు
నిజామాబాద్‌అర్బన్: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో గురువారం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుతాలు సాధించగలరని అన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుర్తుచేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చిందని, క్యాంటీన్‌ల నిర్వహణ, యూనిఫాంలు కుట్టే బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులు ఇంటి పనులు, ఉద్యోగ విధులను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం మహిళా ఉద్యోగులు, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, జిల్లా పౌర సంబంధాల అధికారిణి నార్ల పద్మశ్రీ , జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు
పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ
వేడుకల్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ
హనుమంతు