హోలీ వేళ అల్లర్లను ఊపేక్షించం | - | Sakshi
Sakshi News home page

హోలీ వేళ అల్లర్లను ఊపేక్షించం

Mar 14 2025 1:34 AM | Updated on Mar 14 2025 1:34 AM

హోలీ వేళ అల్లర్లను ఊపేక్షించం

హోలీ వేళ అల్లర్లను ఊపేక్షించం

ఖలీల్‌వాడి : ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని నిజామాబాద్‌ సీపీ పీ సాయి చైతన్య ప్రజలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ హోలీకి ఆరోగ్యకరమైన సంప్రదాయ రంగులను వాడాలన్నారు. శుక్రవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేడుక జరుపుకోవాలని సూచించారు. పండుగను ఇష్టపడని వ్యక్తులపై, వాహనాలపై రంగులు చల్లటం సరికాదన్నారు. బహిరంగ ప్రాంతాల్లో ఇతరులను ఇబ్బందులకు గురిచేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, అల్లర్లకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్‌ ర్యాలీలు, రహదారులపై ఇష్టం వచ్చినట్లు తిరుగొద్దన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

హున్సా ‘పిడిగుద్దుల’పై సమీక్షిస్తాం..

బోధన్‌ మండలం హన్సాలో హోలీ రోజు నిర్వహించే పిడిగుద్దుల ఆటను నిషేధించినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో మీడియా ప్రతినిధులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీపీ స్పందిస్తూ పిడిగుద్దులపై ఎలాంటి నిషేధం విధించలేదన్నారు. ఈ ఆటకు ఎంతమంది హాజరవుతారనేదానిపై సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. హిజ్రాలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

బార్లు, వైన్స్‌ షాపులు బంద్‌

జిల్లాలోని లిక్కర్‌, బార్‌ షాపులను గురువారం సాయంత్రం 6 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు సీపీ సాయి చై తన్య వెల్లడించారు. హోలీ సందర్భంగా మ ద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు, గొడవలు జరిగే ఆస్కారం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బంగులో గంజాయి వంటి మత్తు పదార్థాలు కలుపుకొని తాగితే చర్యలు తీసుకుంటామన్నారు.

బెట్టింగ్‌ నిర్వాహకులపై చర్యలు

జిల్లాలో యువకులు, విద్యార్థులు బెట్టింగ్‌ బారినపడి అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని సీపీ సాయి చైతన్య తెలిపారు. ఎక్కడైనా బెట్టింగ్‌ ఆడినా, బెట్టింగ్‌ యాప్‌లు నిర్వహించినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బెట్టింగ్‌ ఆడేవారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి యాప్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులే

బెట్టింగ్‌ యాప్‌లపై

సమాచారం ఇవ్వండి

రేపటి వరకు లిక్కర్‌ షాపుల మూసివేత

సీపీ సాయి చైతన్య వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement