పరీక్షలంటే భయం వద్దు | - | Sakshi
Sakshi News home page

పరీక్షలంటే భయం వద్దు

Mar 11 2025 1:27 AM | Updated on Mar 11 2025 1:26 AM

సిరికొండ: విద్యార్థులు పరీక్షల పట్ల భయం పెట్టుకోవద్దని ఇంపాక్ట్‌ ఇంటర్నేషనల్‌ మోటివేషనల్‌ స్పీకర్‌ కోటగిరి గంగాప్రసాద్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో సోమవారం ఆయన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఒత్తిడిని అధిగమించి పరీక్షలను ఎలా రాయాలి, సమయాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలి, పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలో వివరించారు. హెచ్‌ఎం గడ్డం రాజేష్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్‌లో బ్రేకర్‌ ఏర్పాటు

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ మండల పరిధిలోని సారంగాపూర్‌ సబ్‌ స్టేషన్‌లో రూ.10 లక్షల వ్యయంతో నూతన బ్రేకర్‌ను విద్యుత్‌శాఖ అధికారులు అమర్చారు. సోమవారం వారు బ్రేకర్‌ను ప్రారంభించారు. వచ్చే ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ అంతరాయం లేకుండా ఉండేందుకు నూతనంగా బ్రేకర్‌ను అమర్చినట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు. డీఈ ఉత్తమ్‌ జాడే, ఏడీఏ బాలేష్‌ కుమార్‌, ఏఈ శ్రీనివాస్‌, విద్యుత్‌ అధికారులు సంజీవ్‌ కుమార్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, హరిచంద్‌, రాంసింగ్‌, అక్బర్‌ నావాజుద్దీన్‌, అప్సర్‌, గూలాబ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ధర్పల్లి: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎంపీడీవో బాలకృష్ణ సూచించారు. మండలంలోని వాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యత గల వంట సామగ్రిని వాడాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు భోజనంలో కోడిగుడ్లు ఎందుకు పెట్టడం లేదని నిర్వాహకులను ప్రశ్నించారు. బర్డ్‌ఫ్లూ వచ్చినప్పటి నుంచి గుడ్లు ఇవ్వడం లేదని హెచ్‌ఎం సమాధానం ఇచ్చారు. అనంతరం హొన్నాజీపేట్‌ గ్రామంలోని నర్సరీ, ఉపాధిహామీ పనులను తనిఖీ చేశారు. వేసవి దృశ్య నర్సరీలోని మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పట్టించాలని సిబ్బందికి సూచించారు.

అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలి

నిజామాబాద్‌ నాగారం: ప్రత్యేక తెలంగాణ కోసం చనిపోయిన అమరుల కుటుంబాలకు, జైలుకు వెళ్లిన ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని జేఏసీ కన్వీనర్‌ గైని గంగారాం అన్నారు. వినాయక్‌నగర్‌లోగల అమరవీరుల స్థూపం వద్ద సోమవారం ఆయన అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అన్ని పార్టీలు ఇప్పటివరకు తెలంగాణ కోసం చనిపోయిన కుటుంబాలకు, జైలుకు వెళ్లిన ఉద్యోగులకు న్యాయం చేయడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైన తెలంగాణ కోసం త్యాగంచేసిన కుటుంబాలకు ఆదుకోవాలని కోరారు. నాయకులు భాస్కర్‌, మోహన్‌, రాజారాం, సంతోష్‌, లక్ష్మన్‌, సక్కి విజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

అనుమతిలేని బడులపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌అర్బన్‌: అనుమతి లేకుండ అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రయివేటు బడులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు నగరంలోని ఓ ప్రయివేటు పాఠశాల ఎదుట సోమవారం వారు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి రఘురాం, ఓమయ్య, రంజిత్‌, అంజలి, తదితరులు ఉన్నారు.

పరీక్షలంటే భయం వద్దు 
1
1/3

పరీక్షలంటే భయం వద్దు

పరీక్షలంటే భయం వద్దు 
2
2/3

పరీక్షలంటే భయం వద్దు

పరీక్షలంటే భయం వద్దు 
3
3/3

పరీక్షలంటే భయం వద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement