డివైడర్‌ మధ్యలోని పూలు తెంపుకొని వస్తుండగా గర్భిణి విషాదం! | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ మధ్యలోని పూలు తెంపుకొని వస్తుండగా గర్భిణి విషాదం!

Apr 6 2024 1:00 AM | Updated on Apr 6 2024 2:09 PM

- - Sakshi

నిజామాబాద్‌: సంప్రదాయం ప్రకారం గోదావ రి నదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్తున్న ఐదు నెలల గర్భిణి.. మార్గమధ్యలో డివైడర్‌పై ఉన్న పూలను తెంపి, వాహనం వద్దకు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది. వివరాలిలా ఉన్నా యి. ఆర్మూర్‌ మండలం సుర్బిర్యాల్‌కు చెందిన కొమిరె మాధవి(25) ఐదు నెలల గర్భిణి. ఐదు నెలల సమయంలో గంగమ్మ పూజలు చేయడం వారి కుటుంబంలో ఆనవాయితీ.

శుక్రవారం ఉదయం మాధవి భర్త గంగసాగర్‌, కుటుంబ సభ్యులతో కలిసి నిర్మల్‌ జిల్లా సోన్‌ వద్ద గల గోదావరిలో స్నానాలు ఆచరించడానికి ఆటోలో బయలుదేరారు. మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద ఆటోను ఆపి జాతీయ రహదారి డివైడర్‌ మధ్యలోనున్న పూలను తెంపడానికి మాధవి వెళ్లింది. పూలను తెంపి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన వాహనం ఆమెను ఢీకొంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement