
ఆర్మూర్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించడం ద్వారా వారికి ఆర్థిక చేయూతనందించినట్లు అవుతోందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆదివారం ఆర్మూర్‌లో ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మహిళలతో పాటు బస్సులో ప్రయాణించారు. ఆర్డీవో వినోద్, తహసీల్దార్ శ్రీకాంత్, ఆర్టీసీ డిపో అధికారులు, బీజేపీ నా యకులు కంచెట్టి గంగాధర్, పొల్కం వేణు, యామాద్రి భాస్కర్, పాలెపు రాజు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సందర్శన..
ఆర్మూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి సందర్శించారు. ఇకపై నియోజకవర్గంలో సమస్యలను విన్నవించడానికి వచ్చే వారు క్యాంపు కార్యాలయంలో తనను కలువవచ్చని సూచించారు.
ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభం
ఆర్మూర్: రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిని రూ. 5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచడంతో ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ పథకంను ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సకు వచ్చే వారికి వ్యాధి నయం అవుతుందనే నమ్మకం రావాలని అన్నారు. అయుష్మాన్ భారత్‌లో భాగంగా ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా చికిత్స చేస్తారన్నారు. అనంతరం సీఎం అమలు చేస్తున్న పథకాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగరాజు, వైద్యులు అమృత్‌రామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి
