
పూజకు హాజరైన భక్తులు
జక్రాన్‌పల్లి: పడకల్ గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ భూనీలా సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అయ్యప్ప సేవా సమితి, గ్రామ కమిటీ సహకారంతో రమణగురు స్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. పడిపూజకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో గురుస్వాములు నర్సారెడ్డి, లోక తిరుపతి, లింగం, నితిన్, పుప్పాల శ్రీనివాస్, ప్రసాద్, సత్య, గుర్క సతీశ్, చందు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

పడి పూజ నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాములు