నిజామాబాద్ రూరల్: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, సారంగాపూర్ చక్కెర కర్మాగారాన్ని తెరపించే వారికే తమ ఓటు వేస్తామని చక్కెర కర్మాగార పరిరక్షణ కమిటీ చెర్మన్ కొండెల సాయిరెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ చక్కెర కర్మాగారం నుంచి మంగళవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతు చైతన్య
యాత్ర ప్రాంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా చక్కెర కర్మాగారాన్ని ఎవరైతే ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన వారికి కిసాన్ సంఘ్ పరివార్, కర్మగార పరిరక్షణ కమిటీ నాయకుల మద్దతు ఉంటుదన్నారు. యాత్రకు అనుమతి తీసుకోలేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యాత్ర ప్రారంభించడానికి కొంత అలస్యం అయింది. అంతకుముందు స్థానిక రామాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.