నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రూరల్ మండ లం ఇరిగేషన్ ఏఈ రాజ్యలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ శనివారం తెలిపారు. వివరాలు.. జూన్ 23న ఆకుల కొండూర్ గ్రామం చెరువులో నుంచి సర్పంచ్ అశోక్, గ్రామస్తులు కొందరు మట్టి తీస్తున్నారనే సమాచారంతో ఏఈ అక్కడకు వెళ్లి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీనిపై గ్రామ సర్పంచ్ తమ గ్రామ తీర్మానం మేరకు చెరువులో నుంచి గ్రామంలో నిర్మిస్తున్న మహాలక్ష్మీ ఆలయానికి, పంట పొలాలకు మట్టిను తీసుకెళ్తున్నటు చెప్పారు. ఈ ఘటనలో ఏఈ, సర్పంచ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా ఏఈ సర్పంచ్, కొందరు గ్రామస్తులపై రూరల్ పోలీస్‌స్టేషన్ ఫిర్యా దు చేశారు. అనంతరం ఏఈకు బాసటగా ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టర్‌ను కలిసి విషయాన్ని తెలిపారు. కలెక్టర్ జోక్యంతో సర్పంచ్‌పై, కొందరు గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు సర్పంచ్ ఏఈపై ఫిర్యా దు చేయగా పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కేసు నమోదు చేయకుండా కోర్టు అనుమతి కోసం పంపారు. కోర్టు నుంచి అనుమతి రాగానే ఏఈపై ఐపీసీ సెక్షన్లు 304, 306 కింద కేసు నమోదు చేశారు.


