రెడ్‌క్రాస్‌ బృందానికి కలెక్టర్‌ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ బృందానికి కలెక్టర్‌ అభినందనలు

Jun 16 2023 6:22 AM | Updated on Jun 16 2023 11:44 AM

- - Sakshi

సుభాష్‌నగర్‌ : ఐఎస్‌ఓ సర్టిఫికెట్ పొందినందుకుగాను జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు గురువారం సాయంత్రం నిజామాబాద్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ బృందాన్ని అభినందించారు. భవిష్యత్‌లో ఇలాగే నిజామాబాద్‌ రెడ్‌క్రాస్‌ సేవలు విస్తరించాలని, రాష్ట్రంలో జిల్లా కీర్తిని మరింత ప్రతిబింబింపజేయా లని కలెక్టర్‌ సూచించారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రామిశ్రాను రెడ్‌క్రాస్‌ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్‌ను రెస్‌క్రాస్‌ బృందం సన్మానించింది. కార్యక్రమంలో నిజామాబాద్‌ రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపె రవీందర్, కార్యదర్శి అరుణ్‌ బాబు, నిజామాబాద్‌ డివిజన్‌ చైర్మన్‌ డాక్టర్‌ శ్రీశైలం, పీఆర్వో బొద్దుల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు 

Advertisement
 
Advertisement
Advertisement