సారంగపూర్: శివాజీ బీడీ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. మండలంలోని మలక్‌చించోలి ఎక్స్‌రోడ్డు వద్ద గల శివాజీ బీడీ పరిశ్రమ ఎదుట బుధవారం బీడీ కార్మికులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలకు 26 రోజుల పనిదినాలు కల్పించాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, 1000 బీడీలకు సరిపడా తునికాకు వేయాలని, గంపల నుండి చాట్ చేసిన బీడీలకు అంతే మొత్తంలో ఆకు, తిరిగి అవే బీడీలను కార్మికులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు, సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


