న్యూస్‌రీల్
కబ్జాల కబంధహస్తాల్లో చెరువులు మురికికూపాలుగా జలవనరులు హైడ్రా వస్తే కానీ.. తీరు మారదా..! భవిష్యత్‌లో జలగండం తప్పదా..!
ఈ చిత్రం హైదరాబాద్‌లోని తమ్మిడికుంటది. మొన్నటిదాకా చుట్టూ కబ్జాలతో ఇరుకుగా మారి, డ్రైనేజీ నీటితో తన రూపునే కోల్పోయే దుస్థితి. హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత ఇదిగో.. ఇలా పూర్వవైభవానికి తోడుగా అదనపు అందాలనూ అద్దుకుంది. ఇప్పుడిది పాత కుంటనేనా..! అని ఆశ్చర్యపరుస్తోంది. అక్కడివాళ్లకు ఆహ్లాదానికీ కేరాఫ్‌గా మారింది.
అర్హులందరికీ ‘చేయూత’
తానూరు: అర్హులందరికీ చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే రామారావ్ పటేల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ ఫంక్షన్హాల్లో లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8,800 పింఛన్లు మంజూరుకాగా ముధోల్ నియోజకవర్గానికి అత్యధికంగా 4,200 మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీధర్, తహసీల్దార్ మహేందర్నాథ్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


