భైంసాటౌన్: గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చే ప్రతీ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సత్వరం పరిష్కరించాలని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీ కరించారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశాలు ఇచ్చారు. భరోసా కేంద్రంలో షీటీం సేవలను పరిశీలించారు. అనంతరం గత గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితిపై సమీక్షించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ పాల్గొన్నారు.


