నిర్మల్‌టౌన్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తానని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మేడారం అపర్ణ ప్రదీప్ అన్నారు. బుధవారం మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కె. శ్రీహరిరావు, మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, కుల సంఘాల ప్రతినిధులను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఆమెను శాలువాతో సత్కరించారు. అనంతరం అపర్ణ మాట్లాడుతూ పార్టీ సీనియర్ల సూచనలతో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


