కడెం: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో 586 మంది లబ్ధి దారులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎంపీడీవో అరుణ, ఏఎంసీ చైర్మన్ భూషణ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొడ్డు గంగన్న, తదితరులు పాల్గొన్నారు.


