సర్‌ రెండోవిడతలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ రెండోవిడతలో భాగస్వాములు కావాలి

Aug 24 2026 7:21 AM | Updated on Aug 24 2026 7:21 AM

భైంసాటౌన్‌: ఎస్‌ఐఆర్‌ రెండోవిడత ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ సూచించారు. పట్టణంలోని ఎస్‌ఎస్‌ జిన్నింగ్‌ ఫ్యాక్టరీలో పార్టీ కార్యకర్తలతో ఎస్‌ఐఆర్‌ రెండోవిడతపై ఆదివారం అసెంబ్లీ కార్యాశాల నిర్వహించారు. సర్‌ ప్రక్రియతో బోగస్‌ ఓట్లకు తావుండదని, రెండోవిడతలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు తెలియజేయాలన్నారు. సర్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ సంజర్ల శ్రీనివాస్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు రితీష్‌ రాథోడ్‌, సర్‌ జిల్లా ఇన్‌చార్జి రావుల రాంనాథ్‌, ముధోల్‌ ఇన్‌చార్జి గంగాధర్‌ సర్‌ రెండో విడతలో చేపట్టాల్సిన అంశాలపై వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తూముల దత్తాత్రి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, రవి పాండే, అసెంబ్లీ కన్వీనర్‌ తాడేవార్‌ సాయినాథ్‌, మండల అధ్యక్షులు, సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement