ఆశల దీపం ఆరిపోయింది | - | Sakshi
Sakshi News home page

ఆశల దీపం ఆరిపోయింది

Aug 22 2026 2:17 AM | Updated on Aug 22 2026 2:17 AM

● కారు ఢీకొని నాలుగేళ్ల బాలిక మృతి ● న్యూలింగంపల్లిలో ఘటన

మామడ: ఇంటి వద్ద స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని, కారు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన మామడ మండలం న్యూలింగంపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూలింగంపల్లికి చెందిన ద్యావత్‌ మహేందర్‌–సౌందర్య దంపతులు. వీరికి మహేశ్వరి(4), 9 నెలల బాబు ఉన్నాడు. మహేందర్‌ ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్తున్నాడు. ఇటీవలే ఇంటికి వచ్చిన ఆయన నెల క్రితం తిరిగి వెళ్లాడు. ఇక కూతురు మహేశ్వరి స్థానిక అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుంది. శుక్రవారం కూడా కేంద్రానికి వెళ్లొచ్చింది. సాయంత్రం తల్లి ఇంటోల పనులు చేసుకుంటుండగా, మహేశ్వరి తన స్నేహితులతో కలిసి మేనమామ సుంకరి సుధాకర్‌ ఇంటి ముందు ఆడుకుంటోంది.

మృత్యువు రూపంలో కారు..

కొరిటికల్‌ గ్రామానికి చెందిన దొడ చిన్నయ్య తన పంటచేనులో డ్రోన్‌తో మందు పిచికారీ చేసేందుకు గ్రా మానికి చెందిన దువ్వేందర్‌రెడ్డితో కలిసి మధ్యాహ్నం కారులో వెళ్లారు. పంటచేనులో పనులు పూర్తి చేసుకుని తిరిగి కొరిటికల్‌ గ్రామానికి బయల్దేరారు. డ్రైవింగ్‌ సరిగా రాని దొడ చిన్నయ్య తాను కారు నడిపాడు. గ్రామంలోకి వచ్చాక వేగంగా రోడ్డు పక్కన ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో మహేశ్వరి తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం నిర్మల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. గ్రామస్తుల సమాచారంతో ఎస్సై హన్మాండ్లు ఘటన స్థలాన్ని సందర్శించారు. కూతురు మరణంతో తమ ఆశల దీపం ఆరిపోయిందని సౌందర్య రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement