నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్, మ్యాపింగ్ కాని ఓటర్ల గుర్తింపు, ఓటర్ల వివరాల్లోని వ్యత్యాసాలు, అనామలీస్ పరిశీలనను నిర్దేశిత నిబంధనల మేరకు పూర్తి చేయాలని సూ చించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్ర ధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సంబంధిత ఉ న్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్ని కల అధికారి జిల్లాల వారీగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పు రోగతిని సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల వివరాల్లో ఏవైనా వ్యత్యాసాలు, అనామలీస్ గుర్తించినట్లయితే వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత తేదీ, సమయంలో హాజరై తమ పౌరసత్వాన్ని నిర్ధారించే సంబంధిత ధ్రువపత్రాలను అందించేలా వారికి అవసరమైన సమాచారం అందించాలని సూచించారు. ఫారం–6, ఫారం–7, ఫారం–8 ద్వారా అందే దరఖాస్తులను పరిశీలించి గడువులోపు పరిష్కరించాలని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఓటర్ల జాబితాల కచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత కీలకమైనందున అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్ తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని కేజీబీవీని బుధవారం రాత్రి కలెక్టర్ భవేశ మిశ్రా ఆకస్మిక తనిఖీ చేశారు. ఆవరణను పరిశీలించారు. భోజనం, విద్య, సౌకర్యాల గురించి ఎస్వో నవితను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఇంగ్లిష్ కథలు చెప్పి పరీక్ష నిర్వహించారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. డీఈవో భోజన్న, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో వనజ, ఎంఈవో రాజునాయక్, ఎంపీవో నసీరుద్దీన్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


