దస్తురాబాద్: ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం మండలంలోని ఆకోండపేట గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవడం లేదని, వ్యవసాయశాఖ సూచన మేరకు తక్కువ నీటి వినియోగం కలిగిన పంటలు సాగు చేయాలని సూచించారు. సేంద్రియ విధానంలో పంటలు సాగు చేసి అధిక ఆదాయం పొందాలని తెలిపారు. గ్రామంలో అసైన్డ్ భూముల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వ్యవసాయ, హార్టికల్చర్‌శాఖల ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్, మునగ మొక్కలు నాటారు. మునగ, ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతు చేలలోకి వెళ్లాంటే కారు అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఉంది. దీంతో అదనపు కలెక్టర్ బైక్‌పై ప్రయాణించి అక్కడికి చేరుకున్నారు.
వీబీజీ రామ్‌జీతోనే గ్రామాలాభివృద్ధి
వీబీజీ రామ్‌జీని సద్వినియోగం చేసుకుని గ్రామాలాభివృద్ధికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వీబీజీ రామ్‌జీ పథకంలో గతంలో కంటే మరిన్ని పనులు చేర్చారని తెలిపారు. ప్రతీ సర్పంచ్, కార్యదర్శి ఈ పథకం కింద పనులు చేపట్టి గ్రామాలాభివృద్ధికి పాటు పడాలని పేర్కొన్నారు. అనంతరం వ్యవసాయ, హార్టికల్చర్ జిల్లా అధికారులు పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, జిల్లా హార్టిల్చర్ అధికారి రమణ, ఏపీడీ నాగవర్ధన్, హార్టికల్చర్ డివిజన్ ఇన్‌చార్జి మౌనిక, ఎంపీడీవో సయ్యద్‌జావిద్ ఆలీ, ఎంపీవో రమేశ్‌రెడ్డి, ఎంఈవో గంగాధర్, సర్పంచులు గోపాల్, మాధవి, లలిత, నరేశ్‌రెడ్డి, రాజేశ్, గంగన్న, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.


