వర్మీ కంపోస్టుతో ఆదాయం సమకూర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వర్మీ కంపోస్టుతో ఆదాయం సమకూర్చుకోవాలి

Aug 21 2026 9:38 AM | Updated on Aug 21 2026 9:38 AM

నర్సాపూర్‌(జి): వర్మీ కంపోస్ట్‌ ఎరువు తయారు చేసి రైతులకు విక్రయించి పంచాయతీలు ఆదాయం స మకూర్చుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌ సూచించారు. మండల కేంద్రంలోని సెగ్రిగేషన్‌ షెడ్డును బుధవారం పరిశీలించా రు. వర్మీ కంపోస్ట్‌ ఎరువు తయారీ విధానాన్ని ఎంపీవో తిరుపతిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో 2025–26లో 4,848 కిలోల వర్మీ కంపోస్ట్‌ ఎరువు తయారు చేసి రైతులకు విక్రయించగా పంచాయతీలకు రూ.46,111 ఆదాయం సమకూరిందని ఎంపీవో తెలిపారు. ఎస్బీఎం నిధులతో స్థానిక శ్రీరామాలయంలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల సముదాయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎల్పీవో లక్ష్మణ్‌, ఏపీవో జగన్నాథ్‌, పంచాయతీ కార్యదర్శి రాథోడ్‌ కై లాస్‌, కారోబార్‌ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

చేపల మార్కెట్‌ను వినియోగించుకోవాలి

లక్ష్మణచాంద: సోన్‌ మండలకేంద్రంలోని చేపల మా ర్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచా యతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌ సూచించా రు. వీబీజీ రామ్‌జీలో భాగంగా సోన్‌లో రూ.10లక్షలతో నిర్మించిన వర్క్‌షెడ్‌ను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. చేపల మార్కెట్‌ను మండలంలోని చుట్టుపక్కల గ్రామాల వారు కూడా సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్‌ సంతోష్‌, ఎంపీవో జ్యోతి, ఏపీవో రామకృష్ణ, సర్పంచ్‌ వనజ, పీఏసీఎ స్‌ చైర్మన్‌ కృష్ణప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమీకృత వ్యవసాయ క్షేత్రం పరిశీలన

ముధోల్‌: మండలంలోని తరోడా గ్రామ శివారులోని సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని పంచాయతీ రాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌ పరిశీలించారు. అంతకుముందు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీడీవో లవకుమార్‌, డీఎల్పీవో లక్ష్మణ్‌, సర్పంచ్‌ అరిఫొద్దీన్‌, ఏపీవో శిరీష, పంచాయతీ కార్యదర్శి అమిత, ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement