నిర్మల్ టౌన్: పట్టణంలో జరిగిన రెండు వేర్వేరు చోరీ కేసులను పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని సాయి గణేశ్ నర్సరీలో కూలీలు నిద్రిస్తున్న సమయంలో నిర్మల్‌కు చెందిన మోసిన్‌ఖాన్ లోపలికి ప్రవేశించి రెండు సెల్‌ఫోన్లు చోరీ చేశాడు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని రెండు ఫోన్లతో పాటు బైక్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అతడిపై గతంలోనూ నిర్మల్ టౌన్, రూరల్, సోన్, ఆర్మూర్ తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులున్నాయని, రౌడీ షీటర్‌గా కూడా ఉన్నట్లు తెలిపారు.
రాగి తీగ చోరీ చేసిన మహిళ అరెస్ట్
ఈ నెల 6న స్థానిక ఓల్డ్ బస్టాండ్ సమీ పంలోని నయీమ్ ఎలకి్ట్రకల్ షాపులో చోరీ జరిగింది. షట్టర్ తాళం పగులగొట్టి లోనికి వెళ్లి సుమారు రూ.17వేల విలు వైన 15కిలోల రాగి తీగ దొంగిలించారు. ఈ మేరకు షాప్ యజమాని పట్టణ పోలీ స్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీ సులు కేసు నమోదు చేసి ఘటనా స్థలా న్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పరి సర ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఇందులో భాగంగా శుక్రవారం నిందితురాలు స్వప్నను అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు నర్సవ్వ, గంగామణి ప రా రీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొ నసాగుతుందని పోలీసులు తెలిపారు.
గంజాయి సాగు చేస్తున్న
ఒకరిపై కేసు
నస్పూర్: ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాయత్రీనగర్‌కు చెందిన బోడకుంట ప్రభాకర్ తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న సమాచారం మేరకు ఎస్సైలు కిరణ్‌కుమార్, జితేందర్ సింగ్ సిబ్బందితో వెళ్లారు. రెండు గంజాయి మొక్కలను గుర్తించారు. ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. హాజీపూర్ ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


