మా నాన్న ముడుసు ఎల్ల య్య యువకుడిగా ఉన్నప్పుడే స్వాతంత్రోద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. నిర్మల్ ప్రాంత విప్లవ వీరులతో కలిసి ఆంగ్లేయ, నిజాం సేనలపై తిరుగుబాటు చేశారు. ఇందులో భాగంగా 1947లో అజ్ఞాతంలో ఉన్న నాన్నతోపాటు ఉద్యమకారులను మంథనిలో పట్టుకుని సిర్పూర్ దగ్గర ఉన్న రోనవెల్లి పోలీస్‌స్టేషన్ తరలించారు. అక్కడ పోలీసుల చేతుల్లో నరకం అనుభవించారు. అక్కడి నుంచి వరంగల్ జైలుకు తరలించారు. అప్పట్లో నెలలతరబడి నాన్న ఆచూకీ లేకపోవడంతో ఆయన చనిపోయాడని భావించి నాన్నమ్మ రాజవ్వ కర్మకాండలు చేయించారు. చాలా నెలలకు తిరిగి వచ్చినా జైళ్లల్లో కొట్టిన దెబ్బలకు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందిపడ్డారు. వారు చేసిన త్యాగాల ఫలితంగానే ఈరోజు మనకు స్వేచ్ఛను ఇచ్చింది. ఇలాంటి సమరయోధులను ప్రభుత్వాలు మర్చిపోవద్దు.
– ముడుసు సత్యనారాయణ


