ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

Aug 15 2026 12:04 AM | Updated on Aug 15 2026 12:04 AM

కడెం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పీఆర్టీయూ కృషి చేస్తుందని యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట నరేంద్రబాబు, బీవీ.రమణారావు అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మండల శాఖ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. 50 ఏళ్లుగా ఉపాధ్యాయులకు అనేక సౌకర్యాల కల్పనలో పీఆర్టీయూ పాత్ర ఎంతో ఉందన్నారు. రానున్న కాలంలో సీపీఎస్‌ రద్దు, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్‌ విధానం, అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీ ఇప్పించే బాధ్యత తమ సంఘం తీసుకుంటుందని తెలిపారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొమ్మిడి మహేశ్వర్‌, ప్రధాన కార్యదర్శిగా బోయిని వెంకటరమణ, అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఎం.దామోదర్‌, మహిళా అసోసియేట్‌ అధ్యక్షుడిగా వనిత, ఉపాధ్యక్షులుగా గంగారం, జ్యోతి, కార్యదర్శులుగా చిట్టేటి నరేశ్‌, ఓం సాయి, మహిళా కార్యదర్శులుగా విద్యాలత, సాయిరాణిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు కోట వేణు, ఎన్నికల పరిశీలకులుగా శంకర్‌ వ్యవహరించారు. నాయకులు రమేశ్‌, దశరథ్‌, ప్రేమదాస్‌, గణేశ్‌, లక్ష్మీనర్సయ్య, చిలివేరి వెంకటరాములు, రమేశ్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement