భైంసాటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను ఖాళీలు ఉన్న పాఠశాలల్లో సర్దుబాటు చేస్తున్న క్రమంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్నయాదవ్ కోరారు. పట్ట ణంలో గురువారం మాట్లాడుతూ.. విద్యార్థులకు బోధనలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టడం సబబే అన్నారు. అయితే జీవో 25లోని నిబంధనల కు విరుద్ధంగా కొన్ని కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో ఉపాధ్యాయులకు అన్యాయం జరగడంతోపాటు సర్దుబాటు ఉద్దేశం దెబ్బతీస్తుందన్నారు. టీచ ర్లు అవసరం ఉన్న పాఠశాలలకు కేటాయించాల్సి ఉండగా, కోరుకున్న ప్రాంతాలకు సర్దుబాటు చేయించుకుంటున్నారని పేర్కొన్నా రు. సీని యారిటీ, నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా కొంతమంది సంఘ నా యకుల జోక్యంతో కేటాయింపులు చేయడం సరికాదన్నారు. సర్దుబాటుపై అభ్యంతరాలు తెలియజేయాలని ఒకవైపు అధికారులు సూ చిస్తూ, మరోవైపు హెచ్‌ఎంలు, ఎంఈవో లు వెంటనే ఉపాధ్యాయులను విడుదల చేయాలని ఆదేశించడం గందరగోళానికి దారితీస్తోందన్నారు. అభ్యంతరాలను పూర్తిస్థాయిలో స్వీకరించి, వాటిని పరిశీలించిన తరువాతే తుది జాబితా విడుదల చేయాలని కోరారు.


