మామడ: ప్రభుత్వ రాయితీ పథకాలను రైతులు స ద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధి కారి రమణ అన్నారు. మండలంలోని పరిమండల్, ఆరేపల్లి గ్రామాల్లో బిందు సేద్యంతో చేస్తున్న సాగు ను, బిందుసేద్యం పరికరాల పనితీరును గురువా రం పరిశీలించారు. ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రై తులతో మాట్లాడారు. ఆయిల్‌పామ్ మొక్కల సాగులో బిందుసేద్యం పరికరాల వినియోగంలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రై తులకు నాణ్యమైన డ్రిప్ పరికరాలను అందించాల ని కంపెనీల ప్రతినిధులకు సూచించారు. బీఎస్పీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులు సాగులో బిందుసేద్యం పరికరాల వినియోగం, రైతులకు ప్రయోజనం, సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ డివిజన్ అధికారి మౌనిక, కంపెనీ ప్రతినిధులు మహేందర్, రైతులు, బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు పాల్గొన్నారు.


