ఖానాపూర్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేర కు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక, ఎంఈవో సంధ్యారాణి జెండా ఊపి ర్యా లీని ప్రారంభించారు. నాయకులు ఆకుల శ్రీని వాస్, అంకం మహేందర్, మాదిరే శ్రీనివాస్, కీర్తి మనోజ్, పుప్పాల ఉపేందర్, అశోక్, ప్రకాశ్‌గౌడ్, రమేశ్, బుచ్చన్న యాదవ్, రాజశేఖర్, అశోక్‌రెడ్డి, శ్రావణ్, భూమన్న తదితరులున్నారు.


