లక్ష్మణచాంద: మూడు నెలల వేతనాలు అందక వీబీజీ రామ్‌జీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం కింద కూలీలకు పని కల్పిస్తూ, వివరాలు ఆన్‌లైన్ చేస్తూ సకాలంలో కూలీ డబ్బులు అందేలా క్షేత్రసహాయకులు నిరంతరం శ్రమిస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలోగల 400 పంచాయతీల్లో 203 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. మే, జూన్, జూలై వేతనాలు అందక కుటుంబ పోషణకు వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.


