నిర్మల్‌చైన్‌గేట్: అర్హులందరికీ చేయూత పింఛన్లు అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష ని ర్వహించారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమో దు, అర్హతల పరిశీలనతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, వ నమహోత్సవం, తెలంగాణ జలసిరి కార్యక్రమాల అమలు పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త చేయూ త పింఛన్ల కోసం ఈ నెల 31వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తులను గ్రామపంచాయతీ కార్యదర్శికి లేదా ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతాలవారు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అందించాల ని సూచించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లు వెంటనే ప్రారంభించి గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. మండలాల వారీగా ఇళ్ల నిర్మాణ పు రోగతిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవా లని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. తెలంగాణ జలసిరి పథకం కింద సోక్ పిట్స్, బోర్‌వెల్స్, ఫామ్‌పాండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు కఠినచర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, నిషేధిత ప్లాస్టిక్ విక్రయిస్తు న్న దుకాణాలను సీజ్ చేసి భారీ జరిమానాలు వి ధించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీ ర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వ ర్లు, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, మున్సి పల్ కమిషనర్లు రవిబాబు, సుందర్‌సింగ్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, అధికారులు పాల్గొన్నారు.


