నిర్మల్‌చైన్‌గేట్: సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో బీడీ కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం ఏవో ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్ మాట్లాడుతూ.. పీఎఫ్ కలిగిన బీడీ కార్మికులకు జీవన భృతి అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15నుంచి చేయూత పింఛన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం బీడీ కార్మికులకూ కల్పించాలని కోరారు. ఎన్నికల హామీ మేరకు రూ.4,016 పెన్షన్ అమలు చేయాలని, రిటైర్మెంట్ తర్వాత రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు పి.గంగామణి, నాయకులు క్లేమెంట్ వెస్లీ, రియాౌత్, మల్లీశ్వరి, అనూష, ఆసియా బాన్, పావని సరిన్, ఉమేరా పాల్గొన్నారు.


