న్యూస్‌రీల్
జిల్లాలో 1,13,170 ఓటర్లు తొలగింపు 6,42,174 లక్షల ఓటర్లు డిజిటలైజ్ నిర్మల్‌అర్బన్‌లో 26,926 యూఈఎఫ్‌లు డబుల్ ఓట్లు 17,926 గుర్తింపు
‘స్వర్ణ’ను చెరబట్టారు
ఒకప్పుడు స్వర్ణ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి సిబ్బంది ఉండేది. ఉద్యోగులు పదవీ విరమణ పొంది తాము ఉన్న క్వార్టర్లలో తిష్ట వేసుకుని ఉన్నారు. స్థలాలు కబ్జా అవుతున్నాయి.
ఈవీఎం గోదాం తనిఖీ
నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ భవేశ్ మిశ్రా సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలన సీసీ కెమెరాలు, అగ్నిమాపక వ్యవస్థ పనితీరు తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, అగ్నిమాపక అధికారి శివాజీ, తహసీల్దార్ రాజు, అధికారి స్వాతి ఉన్నారు.
ఎస్‌ఐఆర్ వివరాలు చెక్ చేసుకుంటున్న నాయకులు, ఓటర్లు(ఫైల్)
నిర్మల్: జిల్లాలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో కీలకఘట్టం పూర్తయింది. ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయడంలో జిల్లా యంత్రాంగం వందశాతం లక్ష్యాన్ని చేరుకుంది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 7,55,344 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించి, పూర్తి వివరాలతో సేకరించారు. ఈనెల 10తో గడువు ముగిసింది. సేకరించిన ప్రకారం జిల్లాలో 6,42,174 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. మరో 1,13,170 మంది ఓటర్ల వివరాలు యూఈఎఫ్(మృతులు, ఆచూకీలేనివారు, డబుల్‌ఓట్లు, వలసలు)గా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
నిర్మల్ నియోజకవర్గంలో..
నిర్మల్ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో మొత్తం 2,64,070 మంది ఓటర్ల వివరాలు నమో దు చేశారు. ఇందులో 2,19,763 ఈఎఫ్(ఎన్యూమరేషన్ ఫామ్)లు డిజిటైజ్ కాగా, 44,307 యూ ఈఎఫ్(అన్ మ్యాప్‌డ్ ఎన్యూమరేషన్ ఫామ్)లు న మోదయ్యాయి. నియోజకవర్గం ఈఎఫ్ డిజి టైజేషన్ శాతం 83.22గా నమోదైంది.
ఖానాపూర్ నియోజకవర్గంలో..
ఖానాపూర్ నియోజకవర్గంలో జిల్లాలోని కడెం, ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాలతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు, ఇంద్రవెల్లి, సిరికొండ, మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలాలు ఉన్నాయి. మొత్తం 2,30,162 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలు నమోదు చేశారు. ఇందులో 2,00,165 ఈఎఫ్‌లు డిజిటైజ్ కాగా, 29,997 యూఈఎఫ్‌లు నమోదయ్యాయి. 86.97 శాతం డిజిటైజేషన్ నమోదైంది.
యూఈఎఫ్‌లలో నిర్మల్ అర్బన్ టాప్
మండలాల వారీగా చూస్తే జిల్లాలో నిర్మల్ అర్బన్‌లో అత్యధికంగా 26,926 యూఈఎఫ్‌లు నమోదయ్యాయి. ఆ తర్వాత భైంసాలో 20,853, ఖానాపూర్‌లో 5,638 యూఈఎఫ్‌లు నమోదయ్యాయి. ఈఎఫ్ డిజిటైజేషన్ శాతంలో దస్తురాబాద్ 94.74 శాతంతో ముందంజలో ఉంది. ఆ తర్వాత తానూరు 92.18, లోకేశ్వరం 91.79, సోన్ 91.74 శాతం నమోదయ్యాయి. నిర్మల్ అర్బన్‌లో 70.98 శాతం ఈఎఫ్‌లు నేరుగా డిజిటైజ్ కాగా, 26,926 యూఈఎఫ్‌లతో మొత్తం వందశాతం వివరాలు పూర్తయ్యాయి.
సర్ జాబితా వివరాలు..
మొత్తం ఓటర్లు 7,55,344
నిర్మల్ 2,64,070
ముధోల్ 2,61,112
ఖానాపూర్ 2,30,162
ఈఎఫ్ డిజిటైజ్ 6,42,174
యూఈఎఫ్ 1,13,170
శాతం 85.02
లక్షకుపైగా ఓట్లు గల్లంతు...
సర్ నివేదిక ప్రకారం జిల్లాలో మొత్తం 1,13,170 మంది ఓటర్ల వివరాలు యూఈఎఫ్(అన్‌మ్యాప్‌డ్/అన్‌మ్యాచింగ్ ఎన్యూమరేషన్)గా నమోదయ్యాయి. వీటినే గల్లంతైన ఓటర్లుగా పరిగణించవచ్చు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. ఖానాపూర్ 29,997 మంది, నిర్మల్ 44,307, ముధోల్ 38,866 మంది ఓట్లు తొలగించనున్నారు. ఇందులో మరణించిన వారు 26,864 మంది, ఆచూకీ లభించనివారు 26,615, శాశ్వతంగా వలసవెళ్లినవారు 41,765, డబుల్ ఓట్లు ఉన్నవారు 17,926 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరు అన్ మ్యాపింగ్‌గా గుర్తించిన వారు మాత్రమే. ఈనెల 17 ముసాయిదా(డ్రాఫ్ట్) విడుదలైన తర్వాత తొలగింపులు/చేర్పులకు అవకాశమిస్తారు. అక్టోబర్ 19న పూర్తిస్థాయి మార్పులు/చేర్పులతో ఫైనల్ జాబితా వెల్లడిస్తారు.
ముధోల్‌లో..
ఈ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో మొత్తం 2,61,112 మంది ఓటర్ల వివరాలు నమోదు చేశారు. 2,22,246 ఈఎఫ్‌లు డిజిటైజ్ కాగా, మృతులు, ఆచూకీ లేనివారు, వలసలు, డబుల్ ఓట్లు అన్నీ కలిపి 38,866 మంది తేలారు. నియోజకవర్గంలో ఈఎఫ్ డిజిటైజేషన్ శాతం 85.12గా నమోదైంది.


