● ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్
పెంబి: గ్రామ పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మండలంలోని అంకెన గ్రామ పంచాయతీ భవనాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. గిరిజనుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన సంఘటన గుర్తు చేశారు. అనంతరం సర్పంచ్ సురేశ్‌ను నూతన గ్రామ పంచాయతీ భవనంలో సన్మానించారు. గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించే వ్యవసాయ గోదాంకు భూమిపూజ చేశారు. గిరిజన గ్రామాల రోడ్డు, వంతెన పనులు అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో నిలిచిపోతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిసె రమేశ్, నాయకులు స్వప్నీల్‌రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


