లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతోంది. విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తూ, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు, రెండు జతల యూనిఫామ్‌లు అందజేస్తోంది. అదనంగా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు నాణ్యమైన, రుచికరమైన, పోషక విలువలు గల మధ్యాహ్న భోజనం అందిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత కోసం గతేడాది నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు అమలులో ఉంది.
తనిఖీలకు అకడమిక్ ప్యానెల్ బృందాలు
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అకడమిక్ ప్యానెల్ బృందాలు ఏర్పాటు చేసింది. ఎంపికై న బృందాల్లోని ఉపాధ్యాయులకు ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో రెండు రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. శిక్షణ అనంతరం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఈ నెల 21 నుంచి తనిఖీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది.
జిల్లాలో ఆరు బృందాలు
జిల్లాలో 577 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 89 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి తనిఖీకి ఆరు బృందాలను నియమించారు. ప్రాథమిక పాఠశాలల కోసం ఐదు బృందాలు ఏర్పాటయ్యాయి. ప్రతీ బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఒకరు ఎఫ్‌ఎల్‌ఎన్ హెచ్‌ఎం, ఇద్దరు ఎస్‌జీటీలు. ప్రాథమికోన్నత పాఠశాలల తనిఖీకి ఒక బృందం ఉంది. ఇందులో ఒకరు స్కూల్ అసిస్టెంట్, ఇద్దరు ఎస్‌జీటీలు సభ్యులుగా ఉన్నారు.
తనిఖీ చేసే అంశాలు..
పకడ్బందీగా నిర్వహిస్తాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని పలు విషయాలను తని ఖీ చేయడానికి ఆరు బృందాలు ఏర్పాటు చేశారు. ఈనెల 21 నుంచి తనిఖీలు మొదలవుతాయి. ఈ బృందాల ద్వారా పకడ్బందీగా తనిఖీలు చేసేలాగా చ ర్యలు తీసుకుంటున్నాం. – భోజన్న, డీఈవో


