చోరీల నియంత్రణకు ‘టాస్క్‌’ఫోర్స్‌! | - | Sakshi
Sakshi News home page

చోరీల నియంత్రణకు ‘టాస్క్‌’ఫోర్స్‌!

Aug 11 2026 11:52 PM | Updated on Aug 11 2026 11:52 PM

● వారం రోజుల్లో 20 కేసుల ఛేదన ● 15 కేసుల్లో కీలక ఆధారాలు సేకరణ ● ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌టౌన్‌: జిల్లాలో దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, చోరీ కేసులు ఛేదించేందుకు రెండు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్‌, నిర్మల్‌ డీఎస్పీ పి.శ్రీనివాస్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలకు నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈమేరకు మంగళవారం ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు.

వారంలో 20 కేసులు ఛేదన

సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలు, గత నేరాల వివరాల విశ్లేషణ ఆధారంగా వారం రోజుల్లో 20 దొంగతనాలను ఛేదించామని తెలిపారు. మరో 15 కేసుల్లో కీలక ఆధారాలు లభించా యని వెల్లడించారు. బైంసా, నిర్మల్‌, నిర్మల్‌ రూర ల్‌, మామడ, సారంగాపూర్‌, లక్ష్మణచాంద, తానూర్‌, కడెం ప్రాంతాల్లో ఇళ్లలో దొంగతనాలు, ఆలయాల్లో చోరీ లు, ద్విచక్ర వాహనాలు, కాపర్‌ వైర్‌ చోరీలపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

48 గంటల్లో హుండీ దొంగల పట్టివేత

బైంసా టౌన్‌ పరిధిలోని పోచమ్మ ఆలయంలో జరి గిన హుండీ చోరీని 48 గంటల్లో ఛేదించామని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నింది తుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాలుడు కావడంతో చట్టప్రకారం చర్యలు చేపట్టామన్నారు. కడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఐదు దొంగతనం కేసులు కూడా ఛేదించామని తెలిపారు.

నియంత్రణకు 13 చెక్‌పోస్టులు

దొంగతనాల నియంత్రణకు జిల్లాలో 13 ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వెల్ల డించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెట్టామని, కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణను పటిష్టం చేశామన్నారు. నిరంతర గస్తీ, వాహన తనిఖీలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా, అనుమానాస్పద వ్యక్తుల పరిశీలన కొనసాగుతున్నాయని వివరించారు. చోరీ కేసుల్లో పెద్ద ముఠాల పాత్రపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల సంబంధాలను పరిశీలిస్తున్నామన్నారు. గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు నిఘా, అవగాహన కార్యక్రమాలు, కేసుల నమోదు కొనసాగుతున్నాయని వివరించారు. నిర్మల్‌ అయ్యప్ప ఆలయం సహా ఇతర ఆలయాలు, ఇళ్ల చోరీ లపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement