స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు

Aug 11 2026 11:52 PM | Updated on Aug 11 2026 11:52 PM

నిర్మల్‌చైన్‌గేట్‌: నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. కడ్తాల్‌ సమీపంలోని సాగర్‌ కన్వెన్షన్‌లో 15న నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి సంబంధించి కార్యక్రమానికి ప్రోటోకాల్‌ ప్రకారం ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. కొంతమంది లబ్ధిదారులను కార్యక్రమానికి ఆహ్వానించాలని తెలిపారు. సరైన లైటింగ్‌, సౌండ్‌ సిస్టం, ఎల్‌ఈడీ తెరను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమానికి హాజరైన వారికి ఎప్పటికప్పుడు తాగునీరు అందిస్తూ ఉండాలన్నారు. సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రెవెన్యూ కిశోర్‌కుమార్‌, ఆర్డీవో దేవిదాస్‌, పౌరసరఫరాల అధికారి రాజేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement