ఈహెచ్‌ఎస్‌ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఈహెచ్‌ఎస్‌ అమలు చేయాలి

Aug 11 2026 11:52 PM | Updated on Aug 11 2026 11:52 PM

సారంగపూర్‌: ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంప్లాయిమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం బాధాకరమని, ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని టీఆర్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దుర్శనం దేవేందర్‌, గడ్డం భూమన్న కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ మూడు నెలల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాల నుంచి కోత విధిస్తున్నప్పటికీ నేటికీ హెల్త్‌కార్డులు జారీ చేయకపోవడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే ఉపాద్యాయులు, ఉద్యోగులకు సంబంధించి అనేక పెండింగ్‌ సమస్యలు ఉన్నాయని, పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల డీఏలు, ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన బదిలీలు అమలు చేయాలన్నారు. జిల్లా నాయకులు పుట్ట రవికిరణ్‌, తాళ్ల చిన్నయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement