ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు పింఛన్ అందించాలి. ఆంక్షలు లేకుండా ప్రతీ కార్మికురాలికి జీవన భృతి అమలు చేయాలి. చాలీచాలని వేతనాలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఓట్ల కోసం వచ్చే నేతలు పింఛన్ ఇప్పిస్తామన్నరు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
– ఆర్తి, బీడీ కార్మికురాలు, భైంసా
కార్మికులందరికీ ఇవ్వాలి..
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేయాలి. బీడీ కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా జీవనభృతి అందించాలి. ఓట్ల సమయంలో హామీలు ఇచ్చి, గెలిచాక మరచిపోవడం సరికాదు. అలాగే, పింఛన్‌ను రూ.4,016కు పెంచాలి. లేనిపక్షంలో కార్మికుల పక్షాన ఆందోళనలు చేపడతాం.
– హరిత, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షురాలు, భైంసా


