నిర్మల్‌ఖిల్లా: మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చేనేత కళను గౌరవించుకుంటూ ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. భారత్‌లో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేతే. తరతరాల నైపుణ్యాన్ని వేళ్ల కొనలతో మగ్గంపై ఆవిష్కరించే నేతన్నల శ్రమను స్మరించుకోవడానికి ఈ రోజు ప్రత్యేక సందర్భం. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఏటా ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారికంగా ప్రకటిస్తూ వస్తోంది.
యువతలో ఆసక్తి
ఒకప్పుడు పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాలకే ప రిమితమైన చేనేత దుస్తులు ఇప్పుడు యువత, ఉ ద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, సా మాజిక కార్యకర్తల దైనందిన జీవితంలోనూ చోటు సంపాదిస్తున్నాయి. వేసవిలో చల్లదనం, చలి కాలంలో వెచ్చదనం అందించే సహజ గుణాలు చేనే త వ స్త్రాల ప్రత్యేకత. రాజకీయ నాయకులు, సంఘాల నాయకులు, సీనియర్ సిటిజన్లతో పాటు వివిధ వ ర్గాల వారు కూడా వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు.
ఖాదీ భండార్‌కు ఆదరణ
టెస్కో(తెలంగాణా హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖాదీ భండార్ చేనేత వస్త్ర దుకాణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేంద్రంగా నిర్మల్ పట్టణంలో కొనసాగుతోంది. చేనేత వస్త్రాలపై మక్కువ ఉన్న వినియోగదారులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఇక్కడ కొనుగోళ్లు చేస్తుండటం గమనార్హం.
ఎగ్జిబిషన్‌లో ఆదరణ
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్‌కే కన్వెన్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న చేనేత–హస్తకళల ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభి స్తోంది. వివిధ రాష్ట్రాల చేనేత కార్మికులు తయారు చేసిన ఖాదీ, చేనేత వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.


