ప్రస్తుతం ప్రాజెక్టులో 1075.10 అడుగుల నీటిమట్టంతో 33.137 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. జలాశయంలోకి 7,015 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 914 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి సరస్వతీ కాలువ ద్వారా నిర్మల్, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, పెంబి, కడెం మండలాల్లోని 47 కిలోమీటర్ల ప్రధాన కాలువ పరిధిలో 33,622 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఈ కాలువకు 28 డిస్ట్రిబ్యూటర్లు ఉండగా, విడుదల చేసిన నీరు దాదాపు 52 చెరువులకు చేరి వాటి కింద సాగు చేస్తున్న పంటలకు ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా కాలువ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడంతో బోరుబావులపై ఆధారపడే రైతులకు కూడా ఊరట లభించనుంది. దీంతో సరస్వతీ కాలువ ఆయకట్టు రైతుల్లో ఉత్సాహం నెలకొంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు..
ప్రస్తుత నీటిమట్టం 1075.10 అడుగులు
నీటి నిల్వ 33.137 టీఎంసీలు
ఇన్‌ఫ్లో 7,015 క్యూసెక్కులు
ఔట్‌ఫ్లో 914 క్యూసెక్కులు


