నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సారంగపూర్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్వర్ణ ఆయకట్టు రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు మంగళవారం నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా మధ్యకాలువ జౌళినాలా నుంచి 80 క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 20 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని, వరిసాగు చేసే రైతులు వరుసతడులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కా ర్యక్రమంలో మండల నాయకులు కాల్వ నరేశ్, స త్యం చంద్రకాంత్, విలాస్ తిరుమలాచారి, సాహెబ్‌రావు, గంగారెడ్డి, స్థానిక సర్పంచ్ సురేందర్, నాయకులు రాజేశ్వర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


