కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

Aug 4 2026 1:35 AM | Updated on Aug 4 2026 1:35 AM

నిర్మల్‌టౌన్‌ : పోలీస్‌ స్టేషన్లలో పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయడంతోపాటు నాణ్యతతో కూడిన దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. నిర్మల్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు, రిసెప్షన్‌, రికార్డు రూంను పరిశీలించారు. వివిధ రికార్డులు, రిజిస్టర్లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్‌ కేసులు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణపై అప్రమత్తంగా ఉండాలని, నేరాల నియంత్రణకు పెట్రోలింగ్‌ పటిష్టం చేయాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ప్రజామిత్ర పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్‌, పట్టణ సీఐ సమ్మయ్య, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement