భైంసా : తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై నియామకాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో పట్టణంలోని మోహన్‌రావు పాటిల్ స్టడీ సర్కిల్‌లో మోహన్‌రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కోచింగ్‌ను ప్రారంభించారు. ట్రస్ట్ చైర్మన్ మోహన్‌రావు పాటిల్, ఆర్‌ఎస్‌ఎస్ నిర్మల్ జిల్లా సహ సంఘ్ చాలక్ కృష్ణదాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్‌రావు పాటిల్ మాట్లాడుతూ అభ్యర్థులు క్రమశిక్షణతో సిద్ధమై ఉద్యోగాలు సాధించాలని, అవసరమైతే ట్రస్ట్ తరఫున ఆర్థిక సహకారం కూడా అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్య విభాగ్ ప్రముఖులు దిగంబర్, జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్, గోపాల్ దాస్ ఆకుల, సుభాష్ జాదవ్, మనోజ్ పాపిన్వార్ తదితరులు పాల్గొన్నారు.


