నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన స్వరూపిణి నృత్య కళాకేత్రం మరోసారి తన కళా ప్రతిభను చాటుకుంది. సంస్థ వ్యవస్థాపకురాలు నవ్య వినయ్ ఆధ్వర్యంలోని 55 మంది చిన్నారులతో కూడిన బృదం విశాఖపట్నంలోని ప్రసిద్ధ సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకుంది. సంప్రదాయ కూచిపూడి నృత్యరీతిలో భక్తి, భారతీయ సంస్కృతి, శాసీ్త్రయ నృత్య వైభవాన్ని ప్రతిబింబించేలా చిన్నారులు తమ ప్రతిభ కనబరిచారు.
ప్రశంసాపత్రాలతో కళాకారులు, గురువు నవ్యవినయ్


