కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల్లో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని కోరుతూ బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు శ్రీకాంత్ రామానుజదాస్, నగేశ్ ఆధ్వర్యంలో గజ్జలమ్మకు అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, పల్లకిసేవ నిర్వహించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
అడెల్లిలో భక్తుల సందడి
సారంగపూర్: ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లి మహాపోచమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. జిల్లా నలుమూలలతోపాటు పొరుగు జిల్లాలు, పొరుగు మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఈవో భూమయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేవారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు


