నిర్మల్ రూరల్: విద్యార్థుల సంపూర్ణ వికాసం వ్యాయమ విద్యతోనే సాధ్యమని వృత్యంతర వ్యాయామ విద్య శిక్షణ తరగతుల కోర్సు డైరెక్టర్ వి.సాయికృష్ణ అన్నారు. మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని నారాయణ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 80 మంది వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు శిక్షణను అందించామన్నారు. మారుతున్న నిబంధనలు, వ్యా యామ విద్య అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, క్రీడారంగంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులను అత్యున్నత స్థాయికి చేర్చడానికి అవసరమైన ప్రణా ళికలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. డీఈ వో భోజన్న వ్యాయామ విద్యపై పలు సూచనలు చేశారు. జిల్లా రిసోర్స్ పర్సన్లు ఎం.శ్రీనివాస్, వి.భూమన్న, అన్నపూర్ణ, జమున, ఉపాధ్యాయుల కు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ వ్యామ ఉపాధ్యాయులు భోజన్న, రమణారావు, అంబాజీ, డేవిడ్, సత్తన్న, వెంకటరమణ, బుచ్చి రామారావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


