వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Jul 31 2026 1:51 AM | Updated on Jul 31 2026 1:51 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో అధిక వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజేందర్‌ సూచించారు. గురువారం ఆయన జూమ్‌ మీటింగ్‌ ద్వారా వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అధిక వర్షాలతో ప్రజలకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులో ఉండాలన్నారు. రోడ్డు మార్గం తెగిపోయే గ్రామాల్లో గర్భిణులను బర్త్‌ వెయిటింగ్‌ రూమ్స్‌కు తరలించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాన్ని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిద్ధంగా ఉంచాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో కార్యక్రమ నిర్వహణ అధికారులు రాకేశ్‌, సౌమ్య, పవన్‌, రమేశ్‌, ఆకాశ్‌ వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement