భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

Jul 31 2026 1:51 AM | Updated on Jul 31 2026 1:51 AM

● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు

నిర్మల్‌చైన్‌గేట్‌: భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదలపై రాష్ట్ర డీజీపీ సీవీ.ఆనంద్‌, ఇతర ఉ న్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో గురువారం వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల వారీగా కు రిసిన వర్షాలు, డ్యాంలలో చేరిన నీరు, దెబ్బతిన్న, రోడ్లు వంతెనలు, చేపట్టిన సహాయక చర్యల వివరా లు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు, వరదలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులంతా వారివారి కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూంలు 24 గంటలు పని చేయాలన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నా రు. ప్రజలకు ఇబ్బందులు కలిగినట్లు సమాచారం అందితే తక్షణమే స్పందించాలని తెలిపారు. గ్రామీ ణ ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు టామ్‌ టామ్‌ వేయించాలని సూచించారు. పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగించాలని, వైద్యారో గ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నా రు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, నదుల పరిసర ప్రాంతాల్లోకి పశువుల కాపరులు, మత్స్యకారులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. డీజీపీ ఆనంద్‌ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తుందన్నారు. పోలీసు శాఖ తరఫున అవసరమైన సహకారం ఉంటుందని తెలిపారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, ఆర్డీవో దేవీదాస్‌, సీపీవో గంగారెడ్డి, డీఎంహెచ్‌వో రాజేందర్‌, డీపీవో శ్రీనివాస్‌, డీఏవో అంజిప్రసాద్‌, హార్టికల్చర్‌ అధికారి రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement